సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గంలో వ్యాపార వర్గాల వారిని చందాలు,దందాల పేరుతో సాగిస్తున్నా అరాచకాలను ఇకపై కొనసాగనివ్వమని బీఎస్పీ కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అడ్వకేట్ యెర్రా కామేష్ వ్యాపారస్తులకు హామీ ఇచ్చారు.మన కొత్తగూడెం-మన కామేష్ కార్యక్రమంలో భాగంగా శనవారం ఆయన పెద్ద బజార్,చిన్న బజార్ ప్రాంతాలలో వ్యాపారస్తులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కొత్తగూడెం నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల చందాలు,దందాలు ఎక్కువయ్యాయని పలువురు వ్యాపారస్తులు తన దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలిపారు.సభలు,సమావేశాల పేరుతో రాజకీయ పార్టీల నాయకులు ఇష్టారాజ్యాంగ దోచుకుంటున్నారని,చందాలు ఇవ్వని వారిపై కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బీఎస్పి పార్టీ గెలిస్తే ఇలాంటి వాటన్నింటికీ చరమగీతం పాడుతుందని స్పష్టం చేశారు.కోవిడ్ సమయంలో,ఆ తర్వాత వ్యాపారాలు చేసుకునేవారు ఎంత ఇబ్బందులు పడుతున్నారో తనకు తెలుసునని తెలిపారు.వ్యాపారుల జోలికి వచ్చి చందాలు అంటూ వసూళ్లకు పాల్పడితే తాట ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.ప్రస్తుత పోటీ ప్రపంచంలో వ్యాపారాలు చేసుకుంటూ మనుగడ సాగించడమే గగనం అవుతుందని,అలాంటి వారిని ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.క్లీన్ కొత్తగూడెం నినాదంతో బీఎస్పీ పార్టీ ముందుకు సాగుతోందని,వ్యవస్థల్లో పేరుకుపోయిన అవినీతిని,వ్యక్తుల్లో పెరుగుతున్న అత్యాశలను సమూలంగా రూపుమాపి నూతన తరానికి కొత్తరకం అభివృద్ధిని పరిచయం చేస్తామని స్పష్టం చేశారు.ఈ మహా యజ్ఞంలో ప్రతి ఒక్కరు తనకు అండగా ఉండాలని తెలిపారు.రానున్న ఎన్నికల్లో తనను గెలిపించి,కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,సాయి,ఏడెల్లి మర్తమ్మ,వసుంధర,సందేలసందీప్,తాటిపాముల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin