సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠం పల్లి మండలంలోని వర్ధాపురం గ్రామంలో గత మూడు రోజులుగా జరుగుతున్న గ్రామదేవతల మహోత్సవం 3వ రోజు గ్రామ సర్పంచ్ బచ్చలకూరి అఖిల ఆధ్వర్యంలో, గ్రామస్తుల సహకారంతో అంగరంగ వైభవంగా వేదమంత్రాలతో విగ్రహ ప్రతిష్ట నిర్వహించడం జరిగింది, కులమతాలకు అతీతంగా హాజరైన జనం భక్తిశ్రద్ధలతో తరించిపోయారు, ఓరెత్తిన భక్తి పరవచం, తరించిపోయిన వర్దాపురం గ్రామ ప్రజలు, విగ్రహ ప్రతిష్ట, కాళాన్యాసము, ప్రాణ ప్రతిష్ట, కుంభం పోయడం, ధేను దర్శనం, అదివాస హోమములు, కాళన్యాస హోమములు, జయాధులు, మహా పూర్ణాహుతి నిర్వహించడం జరిగింది, ఇంత గొప్ప కార్యానికి సహకరించిన గ్రామస్తులకు, సహకరించిన యువతను గ్రామ సర్పంచ్ బచ్చలకూరి అఖిల అభినందించారు, తాను సర్పంచిగా ఉన్న సమయంలో గ్రామదేవతలను దేవతలను ప్రతిష్టించుకోవడం నా గత జన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అఖిల, బచ్చలకూరి బాబు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శివారెడ్డి, మఠంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంజు నాయక్, ఉప సర్పంచ్ శంకరయ్య, వార్డ్ మెంబర్లు, కాంగ్రెస్ నాయకులు వల్లపుదాసు దుర్గయ్య, మాజీ ఎంపిటిసి విశ్వనాథుల శ్రీనివాస్,లింగయ్య, స్వామి అనంతరాములు, వలపుదాసు మధు, సైదులు, రామ్మూర్తి,నాగేశ్వరరావు, విశ్వనాథ వెంకటేశ్వర్లు, చీదెళ్ల నాగేశ్వరరావు గ్రామ పెద్దలు మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
-----------------------
Admin