సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ :కెసిఆర్ ప్రభుత్వం లోపల వేరు బయట వేరని.. అనుభవిస్తే గాని ఏది తెలియదని పదేళ్లు ప్రజలు పడ్డ గోస ఇక చాలని, బీఆర్ఎస్ మళ్లీ ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని ప్రజలు ప్రభుత్వ మోసాలను గమనించాల్సిన అవసరం ఉందని షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. శనివారం షాద్ నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి తదితర సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం ఎన్ని నెరవేర్చిందని? ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టు ఆయన స్పష్టం చేశారు. నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం చేపడితే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో సహకరించిందని, తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రజలు కేసీఆర్ పార్టీని నమ్మి అధికారం కట్టబెడితే వారు ఇచ్చిన మేనిఫెస్టోలలో ఎన్ని హామీలు నెరవేర్చారు? ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. మళ్లీ నియోజకవర్గంలో ప్రజలను మోసం చేసేందుకు టిఆర్ఎస్ పార్టీ ముందుకు వస్తుందని ప్రజలు వీరి మోసాలను గమనించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ పథకాలను కాపీ పేస్టు చేసి మరోసారి ప్రజలను వంచించేందుకు వస్తున్నారని వారిని నిలదీయాలని ప్రతాపరెడ్డి సూచించారు. తెలంగాణలో నీళ్లు నిధులు వనరులు ఉన్నాయనీ, ఇవన్నీ సొంత ప్రయోజనాలకు తప్ప ప్రజలకు వెచ్చించింది ఏమీలేదని అన్నారు. దళిత బంధు ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. అదేవిధంగా డబుల్ బెడ్ రూమ్ ఎన్ని ఇచ్చారని, దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమి, యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని, అసలు నిరుద్యోగ భృతి ఇచ్చారా అని ప్రతాపరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. నేడు అయిదున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఒక్కొక్కరి మీద ₹1,50,000 అప్పు చేశారని నిందించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప జేసింది కేసీఆర్ ప్రభుత్వమని విమర్శించారు. అత్యంత దారుణంగా అప్పులు చేయడం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఏమీ లేదని ధ్వజమెత్తారు. ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్య ఉద్యోగం వైద్యం దక్కినప్పుడే నిజమైన తెలంగాణ సాకారం అవుతుందని అదేవిధంగా తాగు సాగునీరు అందించడమే తెలంగాణ ముఖ్య ఉద్దేశమని అది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్య పడుతుందని ప్రతాప్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ను గద్దె దింపుతాం - కాంగ్రెస్ ను ఎక్కిస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడం ఖాయమని ప్రతాప్ రెడ్డి సవాల్ విసిరారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ఓడిస్తామని కాంగ్రెస్ పార్టీని గద్దె ఎక్కిస్తామని శపధం చేశారు. గత పది ఏళ్లు ప్రజలు ఇబ్బంది పడ్డారని ఇక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనీ ప్రజలు మీ ముఖాలు చూడొద్దని గట్టిగా నిర్ణయించుకున్నారని ప్రతాపరెడ్డి అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఏ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థలను కూడా ఘోరంగా మోసం చేశారని అన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఘోరమైన వ్యతిరేకత వచ్చిందని, కాంగ్రెస్ పార్టీని ఆదరించే పరిస్థితి నెలకొందని ప్రతాప్ రెడ్డి అన్నారు. మీడియా కూడా ధర్మం వైపు నిలిచి తమకు బాసటగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మీడియా తలుచుకుంటే జరగనిది అంటూ ఏదీ లేదని ఒక నియోజకవర్గమే కాదు రాష్ట్రం దేశం ప్రపంచం మొత్తం నడిపిస్తుందని ప్రతాప్ రెడ్డి అన్నారు. ఈ మీడియా సమావేశంలో సీనియర్ నాయకులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, రఘు, బాలరాజ్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, చెన్నయ్య, తిరుపతి రెడ్డి తదితులున్నారు.
-----------------------
Admin