సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం లో సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్నందున 1 వ టౌన్ పోలీసు స్టేషన్ ఆధ్వర్యంలో ప్రజలు సైబర్ నేరాల పై ఫిర్యాదు అవగాహన కలుగుటకు టోల్ ఫ్రీ1930 గల వాహనాన్ని ప్రారంభించిన కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహమాన్. ఆన్లైన్ మోసాలకు గురికాకండి జీవితాలను ఆగం చేసుకోకండి. మీ వ్యక్తిగత సమాచారం జాగ్రత్త లావాదేవీలను అందరికీ తెలిసేలా చేయకండి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి. ఇంటిని, వ్యాపారాలను భద్రత పరుచుకోండి. మొబైల్ హ్యాకర్ల బారిన పడకండి వచ్చిన ప్రతి లింకును ఓపెన్ చేయకండి. సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయడానికి 1930 నెంబర్ కు కాల్ చేయండి... మత్తు పదార్థాలు అమ్మిన సేవించిన పోలీసులకు సమాచారం ఇవ్వండి.
-----------------------
Admin