సర్కార్ టీవీ న్యూస్ / మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : జవహర్ నగర్ జర్నలిస్టు ఐక్యవేదిక సమావేశాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది జవహర్ నగర్ ము న్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ ప్రధాన రహదారి పక్కనగల రోజ్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో జవహర్ నగర్ జర్నలిస్టు ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్త లు హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నిర్మాణం తో పాటు జవహర్ నగర్ జర్నలిస్టులందరికీ నివాస స్థలాల కేటాయింపే ఏకైక లక్ష్యంగా నూతనంగా ఏర్పాటు చేసుకున్న జవహర్ నగర్ జర్నలిస్టు ఐక్యవేదిక నిర్ణయం పట్ల వారు సానుకూలంగా స్పందించి ఎలాంటి జీతభత్యాలు లేకుండా అహర్నిశలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంతో అమూల్యమైన వార్తలు ప్రచురిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తున్న జర్నలిస్టుల కోరికలు సముచితమైనవేనని ప్రెస్ క్లబ్ నిర్మాణం తో పాటు జర్నలిస్టులకు ఫ్లాట్ల కేటాయింపు కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తామని జర్నలిస్టులందరూ ఏకతాటి పైకి రావడం ఎంతో సంతోషకరమైన విషయమని హర్షం వ్యక్తపరుస్తూ పూర్తిస్థాయి మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఏకే మురుగేష్ , ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి ,పల్లపు రవి పానుగంటి బాబు, కారింగుల నిహారిక గౌడ్, మాజీ సర్పంచ్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కారింగుల శంకర్ గౌడ్, టిఆర్ఎస్ జిల్లా నాయకులు మేకల అయ్యప్ప, బీఎస్పీ మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ చీర్యాల జంగయ్య , బిజెపి అధ్యక్షులు రంగుల శంకర్ , బి ఎస్ పి అధ్యక్షులు బిర్రు యాకస్వామి , కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్, మాజీ ఎంపిటిసి టిఆర్ఎస్ సీనియర్ నాయకురాలు రసీదా బేగం, మాజీ వార్డు సభ్యులు బండకింది ప్రసాద్ గౌడ్, నాయకులు బల్లి శ్రీనివాస్ గుప్తా, మెట్టు వెంకన్న ,కృష్ణ గౌడ్ , ఎస్ కె మీరా, ఎస్.కె మస్తాన్ బి , లతోపాటు జవహర్ నగర్ జర్నలిస్టు ఐక్యవేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin