సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం ; తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో రజక వృత్తిదారుల సమస్యలు చేర్చాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముదిగూడ రాంబాబు, చిటికెన ముసలయ్య అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజకవృత్తిదారులకు, సామాజిక భద్రత కై రక్షణ చట్టం, రజక ఫెడరేషన్ కు ప్రతిఏటా రూ 500 కోట్లు, పాలకవర్గం ఏర్పాటు చేయాలని, 50 ఏండ్లు నిండిన రజక వృత్తిదారులకు వృద్ధాప్య పెన్షన్ ,మెడ్రన్ దోబిఘట్లకు స్థలాలు, సోలార్ పవర్ ఏర్పాటు, లాండ్రీ వర్కర్సకి మోపైడ్ వాహనాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన విధంగా జీ.వో ను అమలు చేయాలన్నారు. స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ లలో వర్గీకరణ చేయాలని, తెలంగాణ సాయుధ పోరాట వీరనారి ఐలమ్మ విగ్రహం ట్యాంక్ బండి పైన ఏర్పాటు చేయాలన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్, వామపక్షాలు,ఇతర రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటిస్తున్న సందర్భంగా ఎన్నో ఏళ్లుగా దీర్ఘకాలికంగా రజకవృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిని ఆయా పార్టీల ఎన్నికల ప్రణాళికలు చేర్చి పరిష్కారానికి హామీ ఇవ్వాలని కోరారు.
-----------------------
Admin