Thursday, 30 July 2026 06:04:10 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

18న కంటి వెలుగు ప్రారంభం...

Date : 14 January 2023 10:56 AM Views : 910

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఈనెల 18న మధ్యాహ్నం ఒంటి గంటకు కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభించనున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. కంటి వెలుగు కార్యక్రమానికి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులకు పలు సూచనలు చేశారు. కంటి వెలుగును సీఎం కేసీఆర్ ప్రారంభించిన వెంటనే అన్ని జిల్లాల్లో కంటి పరీక్షలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కంటి పరీక్ష పరికరాలు, కళ్లద్దాలు పీహెచ్‌సీలకు చేరాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని సమన్వయం చేసుకోవాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. పరీక్ష బృందాలకు అవసరమైన సౌకర్యాలు స్థానికంగా కల్పించాలని వివరించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతికి రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు. బృందాలు ఉదయం 9 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఒకసారి వాట్సప్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేలా గ్రామాలు, పట్టణాల్లో ప్రచార కార్యక్రమాలు, ప్రజలకు అర్థమయ్యేలా ఫ్లెక్సీలు, బోర్డులు ఎక్కడికక్కడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్ వేర్ ద్వారా స్క్రీనింగ్ నిర్వహణ ఉంటున్నందున సాంకేతిక సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు. విడతల వారీగా 16, 533 లొకేషన్స్ (రూరల్ -12, 763, అర్బన్ -3, 788)లో క్యాంపులు నిర్వహణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రాథమికంగా 30లక్షల రీడింగ్ గ్లాస్, 25 లక్షల ప్రిస్కిప్షన్ గ్లాసెస్ అవసరమైన వారికి ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అధికారులు ప్రతిరోజూ క్యాంపులు సందర్శించాలన్నారు. హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత మహంతి, డీఎంఇ రమేశ్‌ రెడ్డి, డీపీహెచ్ శ్రీనివాస రావు, టీఎస్ఎంఎంస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్లు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: