సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం లోని చౌటపల్లి గ్రామం నుండి దళిత సామాజిక వర్గానికి చెందిన పలువురు పెద్దలు, యువకులు హుజూర్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నందు శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ని కలిసి... మా గ్రామంలో దళిత సామాజిక వర్గానికి గాను స్మశాన వాటిక లేదని, అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయవలసిందిగా వినతిపత్రం అందించారు.దీంతో ఎమ్మెల్యే సైదిరెడ్డి వెంటనే స్పందించి సంబంధిత రెవెన్యూ అధికారికి ఫోన్ చేసి ఇట్టి సమస్యకు స్థల సేకరణకై విచారణ చేయవలసిందిగా కోరారు. ఇట్టి కార్యక్రమంలో చౌటపల్లి గ్రామానికి చెందిన పలువురు దళిత పెద్దలు, యువకులు* పాల్గొన్నారు.
-----------------------
Admin