సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచల పట్టణంలో మెగా డిజిటల్ మేళా కార్యక్రమాన్ని గురువారం సాప్, ఐటిసి, మరియు ప్రథం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. డిజిటల్ మేళా సంబంధించిన అవగాహన కార్యక్రమం నిర్వహించి పిల్లలకు డిజిటల్ మేళా గురించి అర్థమయ్యేలా వివరించారు. డిజిటల్ మేళా ఉపయోగాలను విద్యార్థులకు తెలియజేశారు. పలువురు విద్యార్థులకు పత్రాలను అందజేశారు. మరికొంతమంది విద్యార్థులకు పత్రాలతో కూడిన బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దేవదాసు , శ్రీనివాస్, లోక్ రాజు సాయి లక్ష్మి, సంతోష్ రూప, రాజు, మల్లికార్జునరావు, కంప్యూటర్ పై అత్యంత అవగాహన ఉన్న ఉపాధ్యాయుల తో పాటు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin