Thursday, 30 July 2026 11:41:15 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అందరికీ అవకాశం ఇచ్చారు. బిజెపికి ఇవ్వండి ఒక్క అవకాశం...

Date : 22 November 2023 11:11 AM Views : 279

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : షాద్ నగర్ నియోజకవర్గంలో అందరికీ అనేక అవకాశాలు ఇచ్చారని బిజెపికి కూడా ఒక్కసారి ఎమ్మేల్యేగా అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని భారతీయ జనతా పార్టీ షాద్ నగర్ అసెంబ్లీ అభ్యర్థి అందె బాబయ్య స్పష్టం చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అభ్యర్థి అంది బాబయ్యతో పాటు బిజెపి నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ టి విజయ్ కుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, కౌన్సిల్ సభ్యులు చెంది మహేందర్ రెడ్డి, భూపాల చారి, సీనియర్ నేతలు దేపల్లి అశోక్ గౌడ్, కక్కులూరి వెంకటేష్ గుప్తా అమడపురం నరసింహ గౌడ్, పేట అశోక్ చెట్ల వెంకటేష్, పాతపల్లి కృష్ణారెడ్డి ఎంకనోళ్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అందే బాబయ్య మాట్లాడుతూ.. అందరికి ఇచ్చారు అవకాశం బిజెపికి ఇవ్వండి ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ అభ్యర్థించారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేసి నియోజకవర్గంలో సాగునీరు అందిస్తా, రైతుల పాదాలు తడుపుతా అన్నారు.షాద్ నగర్ నియోజకవర్గంలో నాణ్యమైన విద్యను అందిస్తానని, నియోజక వర్గ ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన ఉచిత వైద్యం అందిస్తానని, ప్రతి మండల కేంద్రంలో 50 పడకల అన్ని వసతులు కలిగినటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగుపరుస్తానని అన్నారు. ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేస్తామని, స్థానిక యువతకు స్థానిక కంపెనీల్లో స్థానికులకు ఉపాధి కల్పన కల్పిస్తా, నిరుద్యోగ యువతకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తా, ప్రతి గ్రామానికి ప్రజా రవాణా సౌకర్యం కల్పిస్తానని అన్నారు. గ్రామ గ్రామానికి బిటి రోడ్లు ఏర్పాటు చేసి, మండల కేంద్రానికి అనుసందానం చేస్తానని అన్నారు. ప్రతి పేదించి అర్హులైన మహిళలకు సొంతింటి కళ సాకారం చేస్తామని, నిత్యం రద్దీగా ఉండే షాద్ నగర్ పట్టణానికి ఎంఎంపిఎస్ రైళ్లను షాద్ నగర్ కు తీసుకువస్తా, విద్యార్ధుల, ఉద్యోగుల ప్రయాణ సౌలభ్యానికి కృషి చేస్తా అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకాన్ని అర్హులైన నియోజకవర్గ ప్రజలకు అందేలా చూస్తానని, షాద్ నగర్ పట్టణానికి కేంద్రీయ విద్యాలయం తీసుకోస్తానని, షాద్ నగర్ పట్టణంలో రైల్వేగేట్ ద్వారా ప్రజలు పడుతున్న ఇబ్బందులు తీర్చుటకు రైల్వే ఫ్లైఓవర్స్ వెంబడే నిర్మిస్తానని పేర్కొన్నారు. ప్రతి మహిళా సంఘాలకు బ్యాంకు రుణాల ద్వారా చేయూతను అందిస్తానని, షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూర్ మున్సిపాలిటికి కేంద్ర ప్రభుత్వ నిధులతో పట్టణీకరణకు కృషి చేస్తాననీ అంతే బాబయ్య ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా తన సొంత మేనిఫెస్టోను తెలిపారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. బీసీ వర్గాలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియామకం, ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం కమిటీ ఏర్పాటు, రాజ్యాంగ విరుద్ధంగా అమల్లో ఉన్న మతపరమైన రిజర్వేషన్లు తొలగింపు, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక వ్యవస్థ, కోరుకున్న రైతులకు ఉచిత దేశీ ఆవు పంపిణీబిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిచే విచారణ కమిషన్, పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గింపు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణ. చిన్న సన్నకారు రైతులకు ఎరువుల, విత్తనాల కొనుగోలు కోసం 2500 రూపాయల కేటాయింపు భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల, తెలంగాణలో పండించిన వరిధాన్యం క్వింటాకు 3100 రూపాయల కనీస మద్దతు ధరతో సేకరిస్తాం, పేదలకు 10 లక్షల రూపాయల వరకు కార్పొరేట్ స్థాయి వైద్యం, సమ్మక్క సారక్క జాతరకు జాతీయస్థాయి హెూదా ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు ఒకటవ తారీఖున వేతనం, పెన్షన్లు మహిళా సంఘాలకు ఒక శాతం వడ్డీతోనే రుణాలు, ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారులకు ప్రతి సంవత్సరం నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ, అర్హులైన పేదలకు గ్రామాల్లో ఇంటి పట్టాల పంపిణీ, గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ వాసుల రక్షణ కోసం ప్రత్యేక బోర్డు లేదా మంత్రిత్వ శాఖ, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుల పంపిణీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రతి సంవత్సరం ఉచితంగా హెల్త్ చెకప్ ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని శ్రీవర్ధన్ రెడ్డి అన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: