Saturday, 01 August 2026 08:16:18 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భార్య విలాస కోరికలు తీర్చేందుకు.. దొంగగా మారిన కొత్తగా పెళ్లైన వ్యక్తి

Date : 28 July 2025 11:16 AM Views : 521

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : కొత్తగా పెళ్లైన వ్యక్తిని విలాసవంతమైన కోరికలు తీర్చాలని భార్య బలవంతం చేసింది. దీంతో ఉద్యోగం మానేసిన అతడు చోరీల బాటపట్టాడు.... గోల్డ్ చైన్‌ దొంగతనం కేసు దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు అతడ్ని అరెస్ట్‌ చేశారు. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఈ సంఘటన జరిగింది. జామ్‌వరమ్‌గఢ్ గ్రామానికి చెందిన తరుణ్‌ పరీక్‌కు నెల రోజుల కిందట ఒక మహిళతో పెళ్లి జరిగింది. అయితే పెళ్లి తర్వాత భార్య ఖరీడైన డిమాండ్లు కోరింది. విలాసవంతమైన అవసరాలు తీర్చాలని అతడ్ని ఒత్తిడి చేసింది... కాగా, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) గ్రాడ్యుయేట్ అయిన తరుణ్‌ ఒక ప్రైవేట్‌ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా చేస్తున్నాడు. అయితే వచ్చే జీతంతో భార్య లగ్జరీ కోరికలు తీర్చలేక ఇబ్బందిపడ్డాడు. దీంతో ఉద్యోగం మానేసి నేరాల బాటపడ్డాడు. రోజూ తన గ్రామం నుంచి జైపూర్‌ చేరుకుని చోరీలు చేయసాగాడు. మరోవైపు జైపూర్‌లోని ట్రాన్స్‌పోర్ట్ నగర్ ప్రాంతంలో పట్టపగలు వృద్ధురాలి మెడలోని గొలుసును ఒక వ్యక్తి తెంపుకుని పారిపోయాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ చోరీపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. జైపూర్‌ నుంచి గ్రామానికి చేరుకున్న తరుణ్‌ కదలికలను గుర్తించారు. శుక్రవారం అతడ్ని అరెస్టు చేశారు. కాగా, నెల రోజుల కిందట పెళ్లైన తరుణ్ తన భార్య లగ్జరీ కోరికలు తీర్చేందుకు నేరాలు చేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఇప్పటి వరకు అతడు ఎన్ని చోరీలు చేశాడు? ఎవరైనా సహచరులు ఉన్నారా? అని ప్రశ్నిస్తున్నారు. తరుణ్‌ నేరాల గురించి అతడి భార్యకు తెలుసా అని కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :