Friday, 31 July 2026 11:56:17 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అర్హులైన జర్నలిస్టులు అంటే ఎవరో తేల్చి చెప్పాలి..?

Date : 10 September 2024 12:18 PM Views : 617

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు అక్రిడేషన్ కార్డులు హెల్త్ కార్డులు ఇస్తామని చెబుతున్న తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అర్హులైన జర్నలిస్టులు ఎవరో బహిరంగ ప్రకటన ద్వారా తేల్చి చెప్పాలని,తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టులను ఏ ప్రాతిపదికన అర్హులుగా గుర్తిస్తారో దాన్ని ఊరించకుండా కుండబద్దలు కొట్టాలని యాదగిరి కోరారు. వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాదులో ఉన్న కొంతమంది జర్నలిస్టులకు జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ పేరు మీద ఇంటి స్థలాలు ఇవ్వడం హర్షణీయం అన్నారు.అయితే ఒక హైదరాబాదులో మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఎంతోమంది వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారని వారందరికీ ఇంటి స్థలాలు కచ్చితంగా ఇవ్వాల్సిందేనని ప్రభుత్వాన్ని యాదగిరి డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ లో ఉన్న జర్నలిస్టులు సుమారు 30 వేల మంది వరకు ఉంటారని వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు.గతంలో తాము రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి ఇచ్చిన నివేదికలో పొందుపరిచిన అన్ని డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఏ విధంగానైతే రాష్ట్రంలో ఉన్న ప్రతి జర్నలిస్టు కలం కలం గళం గళం కదం కదం కలిపారో అదే విధంగా మాన హక్కులు సాధించు కునేందుకు తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు యూనియన్లకు అతీతంగా ఐక్యమత్యంగా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌసుద్దీన్ రాష్ట్ర కోశాధికారి కొరివి సతీష్ యాదవ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలు సూర్యా పేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడి రవి తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: