సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ & బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు చల్ల శ్రీలత విజయభాస్కర్ రెడ్డి అత్తయ్య గారు కీ"శే"శ్రీమతి చల్ల దేవకమ్మ జ్ఞాపకార్థం నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలం కాసనగోడు బొప్పారం గ్రామాలలో గల జిల్లా పరిషత్ పాఠశాల మరియు ప్రాథమిక, అంగన్వాడీ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు చల్ల పూలమ్మ కృష్ణారెడ్డి, కర్ర ప్రభాకర్ రెడ్డి ప్రజా ప్రతినిధులు, పాఠశాల యాజమాన్యం, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin