సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండలంలో మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతు సోదరులకు, తెలియజేయునది డిసెంబర్ 20వ తేదీ వరకు నూతనంగా పట్టాదారు పాస్ బుక్ పొంది మరియు ఇదివరకు రైతుబంధు పథకానికి దరఖాస్తు చేయని రైతులు ఇప్పుడు రైతుబంధు పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి తెలిపారు. 1 }. ఈనెల 20వ తేదీ వరకు నూతనంగా పట్టాదారు పాసుబుక్కు పొందిన రైతులు దరఖాస్తు చేసుకోవాలి 2 }. అదేవిధంగా గతంలో పట్టాదారు పాసుబుక్కు ఉండి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకొని రైతులు కూడా రైతుబంధు యాసంగికి దరఖాస్తు చేసుకోవాలి 3.} ఇప్పటికే రైతుబంధు డబ్బులు వస్తున్న రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోనక్కర్లేదు 4.} రైతుబంధు దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన పత్రాలు A). రైతు బంధు దరఖాస్తు ఫారం B). పట్టాదారు పాసు బుక్కు జిరాక్స్ C). బ్యాంకు ఎకౌంటు పాస్ బుక్ జిరాక్స్ D). ఆధార్ కార్డు జిరాక్స్ పైన తెలిపిన పత్రాలను సంబంధిత ఏ ఈ ఓ కు (AEO) సమర్పించి దరఖాస్తు చేసుకోవాలని రైతులను కోరనైనది.
-----------------------
Admin