సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పోలీసు అధికారులకు మన్నీల ఫైరింగ్ రేంజ్ లో ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి నేతృత్వంలో జరిగిన ఫైరింగ్ ప్రాక్టీస్ సందర్భంగా వెపన్స్ కండీషన్ పై అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు ఎస్. నాగలక్ష్మి, బసంత్ కుమార్, అనంతపురం జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రశాంతకుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్ వెపెన్స్ కండీషన్ టెస్టింగులో పాల్గొన్నారు. ఇరు జిల్లాల ఎస్పీలు డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి, రాహుల్ దేవ్ సింగ్ తో పాటు రెండు జిల్లాల అదనపు ఎస్పీలు, డీఎస్పీలు ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఏకె 47, ఎల్ ఎంజి, ఇన్సాస్, ఎస్ఎల్ ఆర్, 303, వివిధ రకాల ఫిస్టోల్స్ , కార్బైన్, తదితర ఆయుధాలతో పోలీసు అధికారులు ఫైరింగ్ ప్రాక్టీస్ చేయగా... ఇరు జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు వెపన్ కండీషన్ పై టెస్టు నిర్వహించారు. ప్రతీ అధికారి అన్ని రకాల ఆయుధాల పట్ల పరిజ్ఞానం కలిగి ఉండాలని... వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు ఇలాంటి ఫైరింగ్ ప్రాక్టీస్ లు ఎంతగానో ఉపయోగపడతాయని రెండు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అభిప్రాయపడ్డారు. ఫైరింగ్ లోఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులను సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈకార్యక్రమంలో ఇరు జిల్లాల అదనపు ఎస్పీలు ఇ.నాగేంద్రుడు, రామకృష్ణప్రసాద్, హనుమంతు, పలువురుడీఎస్పీలు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin