సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండలంలోని పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన ఎస్పి నేడు యువత జీవితాలను మంట గలుపుతున్న గంజాయి నిర్మూలన మనందరి బాద్యత అని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపిఎస్ అన్నారు. జిల్లా ఆంద్ర సరిహద్దుగా ఉన్న కారణంగా గంజాయిని అక్రమంగా పెద్ద ఎత్తున తరలించే అవకాశాలు ఉన్నాయన్నారు. దీనిని దృస్టిలో ఉంచుకుని గంజాయిపై జిల్లా పోలీస్ ప్రత్యేక దృష్టిని సారించిందన్నారు. దాని కారణంగానే ఈ మధ్య ఎక్కువ కేసుకావడంతో దీని ప్రభావం కొంత తగ్గిందన్నారు. హైవేలపై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వీటి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి వాటి నివారణకు తగు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలకు రోడ్డు ప్రమాదాలు జరుగకుండా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరు రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు నియమ, నిబంధలను తప్పక పాటించాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్లు ఉండి బస్సులు వెళ్లకుండా నిరుపయోగంగా ఉన్న వాటిని గుర్తించి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి అక్కడికి బస్సులు వెళ్లేలాగా చేసి ట్రాపిక్ ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఈ సమావేశంలో హుజూర్ నగర్ సిఐ చరమంద రాజు, నేరేడుచర్ల గరిడేపల్లి ఎస్సైలు రవీందర్, సైదులు పాల్గొన్నారు.
-----------------------
Admin