సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్ ప్రియాంక అలా ఆదేశించారు. సోమవారం రాత్రి రామవరం లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ప్రియాంక అలా ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించారు. విధులు నిర్వహించే సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలు పరిశీలించిన కలెక్టర్ అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని పేరుకుపోయిన వ్యర్ధాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించారు. ఆసుపత్రి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంచాలని ఆదేశించారు. విధులు నిర్వర్తించే సిబ్బంది యొక్క డ్యూటీ చాటును ప్రదర్శింప చేయాలని సూచించారు.
-----------------------
Admin