సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రంలో జాతీయ నులి పురుగుల నివారణ కార్యక్రమం లో బాగంగా మండలం లోని అన్ని గ్రామాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, మరియు కళాశాల లో 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు అందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయడం జరిగిందని మండల వైద్యాధికారి డాక్టర్ భుక్యా సుధాకర్ నాయక్ తెలిపారు.వారు మాట్లాడుతూ ఈ మాత్రలు తీసుకోవడం వలన పిల్లల్లో రక్తహీనత ను నివారించవచ్చు అని తెలిపారు. ఈరోజు మాత్రలు తీసుకోవడం తప్పిపోయిన పిల్లలకు తిరిగి ఈనెల 10వ తేదీ న వేస్తారని తెలిపారు. కార్యక్రమం లో సూపర్వైజర్ లు రవి కుమార్, నాగేంద్రమ్మ, బెల్లంకొండ శ్రీనివాస్,రమావత్ భాస్కర్, ప్రియాంక, భూదేవి ,ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.
-----------------------
Admin