Saturday, 01 August 2026 08:19:46 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సూర్యా పేటను అభివృద్ధి చేసిన ఘనత జగదీశ్ రెడ్డి దే... -జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్

Date : 19 July 2023 05:53 AM Views : 212

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట ను జిల్లాగా ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత జగదీశ్ రెడ్డి దే నని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పట్టణంలోని వాణిజ్య భవన్ సెంటర్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మల శ్రీనివాస్ గౌడ్ హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడారు. జగదీశ్ రెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికై సూర్యాపేటను ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు. గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం 9 ఏళ్లలోనే జరిగిందని చెప్పుకొచ్చారు.గత పాలకుల చేతిలో వివక్షతకు గురైన సూర్యాపేట నేడు జగదీశ్ రెడ్డి పాలనకు ప్రజలు జేజేలు పల్కుతున్నరని పేర్కొన్నారు. *జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ నూతన జిల్లాల ఏర్పాటుతో రియల్ ఎస్టేట్ రంగం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సభలో జగదీష్ రెడ్డిని సూర్యాపేట ప్రజలు గెలిపిస్తే సూర్యాపేట ను జిల్లాగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. సూర్యాపేటకు జగదీశ్ రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని అన్నారు. సూర్యపేట జిల్లా ను ప్రగతిపథంలో నడిపించేందుకు జగదీశ్ రెడ్డి చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. జగదీశ్ రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ పట్టణ అధ్యక్షులు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవ సలహాదారులు దేవ త్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పందిరి మల్లేష్ గౌడ్, బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, ఐతగాని మల్లయ్య గౌడ్, బైరు వెంకన్న గౌడ్, పాల సైదులు, సలీం, మాదిరెడ్డి గోపాల్ రెడ్డి,అమరవాది శ్రవణ్, భానోత్ జానీ నాయక్ ,వై ఎల్ ఎన్ గౌడ్ తదితరులు ఉన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: