సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలంలోని టపాసుల దుకాణదారులు ఎవరైనా సరే ఈ నిబంధనలు పాటించాలి ఎస్సై కే. గోపి తెలియజేశారు. @ ప్రభుత్వ అనుమతి లేనిది టపాసులు అమ్మరాదు అలా ఎవరైనా అమ్ముతున్నట్లు తెలిస్తే చెట్టపరమైన చర్యలకు బాధ్యులు. @ టపాసుల దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. @ టపాసులు దుకాణాలు ఏర్పాటు చేయడానికి ఐరన్ పోల్స్ ని మరియు జింక్ ఐరన్ షీట్లను వాడాలి. @ దుకాణానికి... దుకాణానికి మూడు మీటర్ల దూరం ఉండాలి. @ జన సంచారానికి దూరంగా ఉండేలా చూడాలన్నారు. @ పెట్రోల్, గ్యాస్ గౌడన్స్ పరిసర ప్రాంతాల్లో ఉండకూడదు . @ ఫైర్ జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి దుకాణం వద్ద రెండు డ్రమ్ముల నీరు మరియు నాలుగు బకెట్ల ఇసుకను నిలువ ఉంచాలి. @ హై పవర్ ఎలక్ట్రికల్ వైర్ల కింద షాపులు ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. @ 18 ఏళ్లలోపు బాలలను దుకాణాలు పనులకు ఉంచకూడదు. @ Explosive act and labour act నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఓబుల దేవర చెరువు మండలం ఎస్సై కే .గోపీ.
-----------------------
Admin