సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ అన్నదాన కార్యక్రమాన్ని సీఐ చరమంద రాజు, ఎస్సై ముత్తయ్య, లారీ అసోసియేషన్ అధ్యక్షులు & వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మతసామరస్యానికి వినాయక చవితి పండగ ప్రతీక అని,హిందూ,ముస్లిం, క్రిస్టియన్ అందరూ కలిసి మెలిసి చేసుకునే వినాయక చవితి ఉత్సవాలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని, నిమజ్జనం కార్యక్రమంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఘర్షణలు లేకుండా విజయవంతంగా చేయాలని వారు తెలియజేశారు, అదేవిధంగా, హుజూర్నగర్ లోజరిగే అతిపెద్ద పండగ అయిన ముత్యాలమ్మ పండగను నిర్వాహకులు 15వ తారీకు, 16వ తారీకు పండగ నిర్వహించుచున్నామని ప్రకటించారని కావున వినాయక విగ్రహాలను ఐదో రోజు నుండి పూర్తిస్థాయిలో హుజూర్ నగర్ టౌన్ లో నిమజ్జనం చేయాలని వారు వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం లో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెక్రెటరీ ఇంద్రారెడ్డి ఉపాధ్యక్షులు శ్రీనివాస్,కోశాధికారి శ్రీనివాస్ రాజు,గౌరవ అధ్యక్షులు సంజీవ రెడ్డి, గౌరవ సలహాదారులు శంకర్ రావు గారులు సంఘ సభ్యులు పాల్గొన్నారు....
-----------------------
Admin