సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : వాల్మీకి బోయలు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు అదే విధంగా అన్ని జిల్లాల వాల్మీకి బోయలు ఈ నెల 9 ప్రభుత్వం నిర్ణయించే వాల్మీకి జయంతిలో పాల్గొన రాదని ఏకగ్రీవ తీర్మాణాలు చేస్తూ ప్రభుత్వం పై ఉద్యమ జెoడా ఎగుర వేస్తున్నారని వాల్మీకి అధ్యక్షుడు బండి కిష్టప్ప తెలియజేశారు రామాయణ మహాకావ్య రచయిత, ఆదికవి, కవికోకిల, వాక్య విశారదుడు, మహాజ్ఞాని, భగవాన్ శ్రీ వాల్మీకీ మహర్షి జయంతిని జరుపుకోవడం.. మన కర్తవ్యం, కనీస ధర్మంగా భావించి మన పల్లెల్లో మనమే జరుపుకోవాలి అంటూ పిలువునిచ్చారు . బోయల ఐక్యతతో శ్రీ మహార్షి వాల్మీకి జయంతి నిర్వహించి.. సమైక్యతను చాటుకుందాం మన శక్తి ఈ పాలకులకు తెలియ చేద్దాo అని జాతి బిడ్డలను కోరిన రాష్ట్ర వాల్మీకి నాయకులు బండి క్రిష్టప్ప. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాల్మీకి బోయ జాతి ఎస్టి పునరుద్ధరణ అంశంపై గత ప్రభుత్వ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా పోరాడి వాల్మీకుల సమస్యలను పరిష్కరించలే పోయింది, విసుకు చెందిన వాల్మీకులు, గత ప్రభుత్వానికి ఓట్లు వేసి వారిని గద్దెదిoపి సరైన సమాధానం చెప్పారు. ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర సందర్భంగా చాలా నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో మాట్లాడుతూ, పక్కన కర్ణాటక రాష్ట్రంలో వాల్మీకి బోయలు ఎస్టీలుగా ఉన్నారు, అలాగే భారతదేశంలో 27 రాష్ట్రాల్లో వాల్మీకి బోయ,లు ఎస్సీ ఎస్టీలు గా ఉన్నారు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలకు గాను, ఏజెన్సీ ప్రాంతాల్లో షెడ్యూల్ ట్రైబ్ గా, మైదాన ప్రాంతంలో ఉన్న వాల్మీకి బోయ,లు బీసీలుగా ఉన్నారు అని నేను వస్తానే బోయలకు న్యాయం చేస్తా అంటూ చాలా బహిరంగ సభల్లో చెప్పడం జరిగింది,అదే విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే, మొదటి అసెంబ్లీ సమావేశాల్లో వాల్మీకి బోయల ఎస్టీ పునరుద్ధరణ అంశాన్ని , కేంద్ర ప్రభుత్వానికి పంపించి, మీకు న్యాయం చేస్తాము అని హామీలు గుప్పిoచారు అది నమ్మి ఓట్లేసిన బోయలను నట్టేట ముంచారని అదేవిధంగా వారు అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాలు కావస్తున్నా, వాల్మీకి బోయలను చిన్న చూపు చూస్తూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా అత్యున్నత పదవిలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2019 ఎలక్షన్ ముందు కర్నూలు బహిరంగ సభలో మాట్లాడుతూ,వాల్మీకి బోయల సమస్య నాకు తెలుసు, ఈసారి కేంద్రంలో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సమస్యను తీర్చే బాధ్యత నేను తీసుకుంటానని హామి ఇచ్చి కేంద్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని నట్టేట ముంచారు అని రాయదుర్గం వాల్మీకి అధ్యక్షులు బండి కిష్టప్ప ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వంలో ఉన్న ఏ ఎమ్మెల్యే గాని లేదా ఎంపీ గాని, మా సమస్యలపై గట్టిగా పోరాడకపోవడం, చాలా బాధాకరమని తెలియజేస్తూ వాల్మీకుల పట్ల వారి వివక్షతను దుయ్యబట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 60 లక్షల జనాభా ఉన్న వాల్మీకి బోయల ఎస్టి పునరుద్ధరణ అంశంపై 66 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం అని మమ్మల్ని అన్ని రాజకీయ పార్టీలు ఒక ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే వాడుకుని, మా ఓట్లతో గద్దెనెక్కిన రాజకీయ నాయకులు, అసెంబ్లీలో గాని పార్లమెంట్లో గాని మా సమస్యలపై స్పందించకపోవడం, చాలా బాధాకరమని, వాల్మీకి సంమం సెక్రెటరీ ఎన్ టి సిద్ధప్ప మండిపడ్డారు. రాయదుర్గం లో ఘనంగా వాల్మీకి జయంతిని నిర్వహించడానికి వాల్మీకి కుటుంబ సభ్యులు, ఈ సందర్బంగా తీర్మానించారు. ఈ నెల 09/10/2022 రాయదుర్గం పట్టణం కోటలో ఉన్న శ్రీ మహర్షి వాల్మీకి కళ్యాణమండపం నందు ఉదయం 09:00 గంటలకు రామాయణ మహాకావ్య రచయిత ,ఆదికవి, కవికోకిల, వాక్య విశారదుడు, మహాజ్ఞాని, భగవాన్ శ్రీ వాల్మీకీ మహర్షి జయంతిని జరుపుకోవడం.. మన కర్తవ్యం, కనీస ధర్మంగా భావించి వాల్మీకులు అందరూ మహార్షి జయంతిని. జరుపుకోవాలి అని వాల్మీకి కుటుంబ సభ్యులు తీర్మానించారు. వాల్మీకి కళ్యాణమండపం నుండి అత్యధిక సంఖ్యలో పాల్గొని బైక్ యాత్ర ద్వారా వినాయక సర్కిల్ మీదుగా శాంతినగర్ లో ఉన్న భక్త కన్నప్ప విగ్రహం వద్దకు చేరుకొని భక్తకన్నప్పకు, ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడినుండి, బయట పేట, కేబి ప్యాలెస్ రోడ్ మీదుగా లక్ష్మీ బజార్ చేరుకొని, ప్రభుత్వ ఆసుపత్రి లో ఉన్న రోగులకు, పాలు బ్రెడ్లు పండ్లు, పంపిణీ చేస్తూ వాల్మీకుల సత్యాగ్రహ దీక్ష విజయవాడలో బోయల గిరిజన రిజర్వేషన్ల కోసం రెండు కళ్ళు లేని కురవృద్ధుడు మన హక్కుల కోసం వాల్మీకుల సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తున్న కోనాపురం ఈశ్వరయ్య రాయదుర్గం వాల్మీకి కుల బంధవులు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ తీర్మాణం చేసారు. శ్రీ వాల్మీకి జయంతి రోజు ఎస్టి రిజర్వేషన్ పునరుద్ధరణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ 09/10/2022 రోజున ఐదు మండలాలు వాల్మీకి కుల బాంధవులు అత్యధిక సంఖ్యలో పాల్గొని. నల్ల బ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయాలని, వాల్మీకి కుటుంబ సభ్యులు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి నాయకులతో పాటుగా 5 మండలాల వాల్మీకి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
-----------------------
Admin