సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ : 2022-23 సం కు గాను "ఇంధన పొదుపు" విభాగంలో రాష్ట్రస్థాయిలో కోదాడ డిపోకు వెండి బహుమతి లభించింది. డి టి ఎస్ ఆర్ ఈ డి సి ఓ ( తెలంగాణ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్) వారు అందించే టి ఎస్ సి ఏ ( తెలంగాణ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ ) ను 2022-23 కు సంబంధించిన అవార్డులను ది 20/12/23 హైదరాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్, ఖైరతాబాద్ నందు బహుమతి ప్రధానోత్సవం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన చందన్ మిత్ర చేతుల మీదుగా కోదాడ డిపో తరఫున డిపో మేనేజర్ డి శ్రీ హర్ష బహుమతి అందుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో కోదాడ డిపో తరఫున డి సుగుణాకర్ (ఎం ఎఫ్) , శివకుమార్(కె ఎం పి ఎల్ మెకానిక్ ) , జి ఎం రావు ( ఎస్ డి ఐ ) కోదాడ డిపో లోని ఉత్తమ డ్రైవర్ అయిన ఎస్ కె రంజాన్ పాల్గొన్నారు.
-----------------------
Admin