Saturday, 01 August 2026 12:06:24 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిళ్ళు పంపిణీ చేయాలని డిమాండ్...

Date : 22 September 2023 05:35 AM Views : 457

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : తెలంగాణ భవన నిర్మాణ కార్మికులకు మేడే సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం మోటార్ సైకిళ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దొడ్డ రవికుమార్ అధ్యక్షతన ఈ సందర్భంగా జరిగిన సభలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు తల నరసింహారావు మాట్లాడారు భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం మోటార్ సైకిల్ ఇస్తామని వాగ్దానం చేసి సంవత్సరం గడిచిపోయి రెండో సంవత్సరం వచ్చిందని అయినప్పటికీ ఒక్క కార్మికుడికి కూడా మోటార్ సైకిల్ పంపిణీ చేయలేదని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్న నిధులన్నింటిని ప్రభుత్వం దారిమల్లించి అడ్డగోలుగా ఖర్చు పెడుతుందని విమర్శించారు. సంక్షేమ బోర్డులోని నిధులన్నీ భవన నిర్మాణ కార్మికుల కోసం మాత్రమే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 1500 కోట్ల రూపాయల డబ్బులను సంక్షేమ బోర్డు నుంచి దారి మళ్ళించిందని ఆ డబ్బులు మొత్తం తిరిగి సంక్షేమ బోర్డులో జమ చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది. వేల సంఖ్యలో చనిపోయిన కార్మికులు ప్రసవాలు వివాహాలకు సంబంధించిన క్లైములు ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని పెండింగ్ క్లెయిమ్ల పరిష్కారానికి ప్రభుత్వం ఇష్టానుసారంగా వెల్ఫేర్ బోర్డు నుంచి వాడుకున్న డబ్బులను తిరిగి జమ చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డులో జమైన ప్రతి పైసా కార్మికుల హక్కుని కార్మికుల హక్కుల్ని ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శించారు వెల్ఫేర్ బోర్డు ద్వారా భవన నిర్మాణ కార్మికులందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ఇల్లు ఇంటి స్థలం లేని నిర్మాణ రంగ కార్మికులకు గృహ లక్ష్మీ పథకం కింద ఇంటి స్థలాలతో పాటు ఐదు లక్షల రూపాయల ఇంటి నిర్మాణ వ్యయాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకు వచ్చిన లేబర్ కోడులను రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్రంలో లేబర్ కోడ్లను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తెచ్చిన లేబర్ కోళ్లు అమలు అయితే 1996 కేంద్ర నిర్మాణ రంగ కార్మికుల చట్టం నీరుగారి పోతుందని పిట్టల అర్జున్ ఉప్పు తల నరసింహారావు పేర్కొన్నారు 1996 నిర్మాణరంగ కార్మికుల చట్టం ఆధారంగానే తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణరంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటయిందని ఇప్పుడు అసలు చట్టాన్ని రద్దు చేయడం ద్వారా వెల్ఫేర్ బోర్డును కూడా నీరుగార్చి రద్దు చేసే ప్రమాదం ఉందని సిఐటి యు నేతలు పేర్కొన్నారు. నిర్మాణరంగ కార్మికుల పిల్లలకు సంక్షేమ బోర్డు ద్వారా విద్యా రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు నిర్మాణ రంగ కార్మికుల సమస్యలపై పోరాడుతామని పేర్కొన్నారు. ధర్నా వద్దకు కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ షర్ఫుద్దీన్ హాజరై వినతి పత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డులో పెండింగ్ క్లెయిమ్ల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, మోటార్ సైకిల్ పంపిణీ విషయం గురించి రాష్ట్రస్థాయి నుంచి ఎటువంటి నియమ నిబంధనలు రాలేదని పై అధికారులు సంప్రదించి త్వరితగతన జిల్లాలో పథకం అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని, ఇతర సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులకు లేఖ రాస్తామని హామీ ఇచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు నాయకులు గుర్రం రాములు కిషోర్ నాగరాజు మద్దిరాల వాణి సత్యనారాయణ జ్యోతి సుంకర వెంకటేశ్వర్లు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: