సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి : విద్యుత్ షాక్ తో యువకుడు మరణించిన సంఘటన బుధవారం మండల పరిధిలోని గుంపేన పంచాయతీలోని కోయకట్టుగూడెం గ్రామంలో చోటుచేసుకుంది.మృతుని బంధువుల కథనం ప్రకారం ఏరదేశీ భద్రయ్య వయసు సుమారు 22 సంవత్సరాలు అనే వ్యక్తిని ముద్దుకూరు గ్రామానికి చెందిన ఎలక్ట్రిషన్ రమేష్ పంచాయతీ మోటర్ బిగించే పనికి అదే ఊరిలో ఉంది రమ్మని తీసుకొని వెళ్లాడని, ఎల్సి తీసుకోకుండా వైర్ బిగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైరు అనుకోని షాక్ కొట్టడంతో యువకుడు ప్రమాద స్థలంలోనే మరణించాడని. దీనికి కారణం ఎల్ సి తీసుకోకుండా రమేష్ నిర్లక్ష్యంగా కరెంటు పని చేయడమే అన్నారు. యువకుని మృతితో గ్రామము మొత్తం విషాద ఛాయలు నెలకోన్నాయి. అతి చిన్న వయసులోనే తన ఒక్కగానొక్క కొడుకుని పోగొట్టుకున్న ఆ కుటుంబాన్ని తక్షణమే ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితుడి బంధువులు వేడుకుంటున్నారు. ప్రమాదానికి కారణమైన రమేష్ పరారీలో ఉండటంతో మృతుని బంధువులు ఎర్రగుంట పి హెచ్ సి హాస్పటల్ వద్ద మృతదేహంతో ఆందోళన చేపట్టారు. అన్నపురెడ్డి పల్లి మండలం ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వివరాలు తెలియాల్సి ఉంది.....
-----------------------
Admin