సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : మొదలైన ఎంగిలి పూల బతుకమ్మ సందడి సర్కార్ న్యూస్ నర్సంపేట మరిపెడ మండలంలోని మహాలయ అమావాస్య సందర్భంగా సాయంత్రం ‘ఎంగిలి పూల బతుకమ్మ’తో వేడుకలు ప్రారంభం అయినవి.ఇక ఇవాళ ఎంగిలి పూల బతుకమ్మ సందడి మొదలైంది. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించేందుకు మహిళలు సిద్దమయ్యారు. సాయంత్రం సాంప్రదాయ పాటలతో ఊరూరా బతుకమ్మకు స్వాగతం పలుకుతూ వేడుకలు జరిపేందుకు సిద్దమయ్యారు.సెప్టెంబర్ 30వ తేదీ వరకు గౌరీ దేవిని రోజుకో రూపంలో 9 రోజుల పాటు 9 రూపాల్లో పూజిస్తారు. బతుకమ్మ పండుగ లో భాగంగా మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మగా అమ్మవారిని ఆరాధిస్తారు.
-----------------------
Reporter