Saturday, 01 August 2026 12:17:52 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎవరూ ఎన్ని కుయుక్తులు చేసినా బీఎస్పీ గెలుపు ఖాయం...

Date : 28 August 2023 09:40 AM Views : 454

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ : ఎవరూ ఎన్ని కుయుక్తులు చేసినా త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ జెండా ఎగురవేస్తామని ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేష్ ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.యస్.ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు ప్రతీ ఆదివారం నిర్వహించే జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని వెంకటేశ్వర హిల్స్ కాలనీ,వనమా కాలనీ,ప్రభుత్వ ఆసుపత్రి వద్ద,గాంధీనగర్,జగ్గూ తండా తదితర ప్రాంతాల్లో కామేష్ జెండా ఆవిష్కరించి మాట్లాడారు.నియోకవర్గంలో ఏ సమస్య వచ్చినా ప్రజలకు గుర్తుకు వచ్చేది బీఎస్పీ అని అన్నారు.ప్రజలను,ప్రజా సమస్యలను పట్టించుకోని అధికార పార్టీ నాయకులు ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.అధికార పార్టీలో అంత్గతంగా పంచాయతీ ఉందని,సుప్రీం కోర్టు తీర్పు ఇంకా పెండింగ్ లో ఉందని అన్నారు.ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతీ ఒక్కరూ ప్రజాసేవ అంటూ వస్తారని,వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.నియోజకవర్గంలో స్వచ్ఛమైన తాగునీటి అందించలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని,అందుకు అధికార బీఆర్ఎస్ పార్టీ కారణమని అన్నారు.బీసీ,ఎస్టీ,ఎస్సీ,మైనారిటీ, అగ్రవర్ణ పేదలను అక్కున చేర్చుకునేది బీఎస్పీ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.రానున్న ఎన్నికల్లో ప్రజలే బీఎస్పీని గెలిపించుకుని తీరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు బండి రమణి,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలు కేతిని కుమారి,యర్రంశెట్టి రాజేశ్వరి,ఏడెల్లి మర్థమ్మ,అనిల్,భానుమతి తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :