Friday, 31 July 2026 07:54:13 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జూన్ 14వ తేది న అయ్యప్ప ఆలయంలో చిన్నారులకు పురోహితులచే అక్షరాభ్యాసం కార్యక్రమం...

Date : 29 May 2023 11:46 PM Views : 506

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు మండల పరిధి సమీపంలో ఎం.కొత్తపల్లి బండపై వెలసిన శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయ ఆవరణలో శ్రీ విద్యాగణపతి సన్నిధిలో జూన్ 14వ తేది జేష్ట్య మాస ఏకాదశి అశ్వని నక్షత్రం పురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులునాయుడు తెలిపారు. సోమవారం రెవిన్యూ కార్యాలయం వద్ద అక్షరాభ్యాసం కరపత్రాలు తహసీల్దార్ కునుకుంట్ల శ్రీధర్, ఎంపిడిఓ పోలప్ప చేతుల మీదుగా విడుదల చేయగా,మండల విద్యాధికారి ఎస్ఎండి ఖాదర్ వలి బాషా, ఐసిడిఎస్ సూపర్వైజర్ జయమ్మ, ఏపిడి శ్రీనివాసులు, హోసింగ్ ఏఈ హరినాథ్ రెడ్డి, రిసర్వే డిప్యూటీ తహసీల్దార్ జాకీర్, ఆర్ఐ నాగేంద్ర, ఈఓఆర్ డి రాజశేఖర్, వెలుగు సీసీ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ.... మండలంలో ఎక్కడలేనివిధంగా అయ్యప్పస్వామి దేవస్థానం ఆవరణలో శ్రీ విద్యాగణపతి సన్నిధిలో.... బాసర జ్ఞాన సరస్వతిదేవి ఆలయంలో నిర్వహించే తరహాలో 5 నుండి 6 ఏళ్ళ చిన్నారులకు(పాఠశాలలో చేర్పించే ముందు)తొలి అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించేందుకు ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు శ్రీకారం చుట్టి ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. మండలంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన చిన్నారుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈసందర్బంగా ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు మాట్లాడుతూ....కదిరికి చెందిన దాత రిటైర్డ్ హెచ్ఎం కీర్తిశేషులు చంద్రమౌళి కుమారుడు కోడూరు శ్రీకాంత్ సహాయ సహకారాలతో అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొనే చిన్నారులకు ఉచితంగా పలక,బలపం అందించినున్నట్లు తెలిపారు. అలాగే అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొనే 5 నుండి 6 ఏళ్ల చిన్నారుల పేర్లు జూన్ 5వ తేది లోపు ఈ నంబర్లను 9908342433, 8106346433 సంప్రదించి ముందుగా నమోదు చేసుకోవాలని పేర్కొంటూ....ఆలయంలో పురోహితులతో పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ అన్న ప్రసాదాలు అందిస్తారని తెలిపారు. ఈకార్యక్రమంలో సర్వేయర్ వినోద్ కుమార్ రెడ్డి,వీఆర్వోలు వెంకటరమణ, శివప్ప,రమణస్వామి,లోకేశ్వరి, వీఆర్ఏలు రంగప్ప,రాముడు,సుమలత, సోము,సిఓ విశ్వనాధ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: