సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం పట్ల హుజూర్ నగర్ టి ఎస్ జె ఏ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చిలక సైదయ్య మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి , హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి లకు తమ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా యునియన్ లతో సంబంధం లేకుండా వర్కింగ్ లో ఉన్న చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి జర్నలిస్టు సమస్యను పరిష్కరించాలి అని కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లాస్థాయి ప్రెస్ క్లబ్ ప్రతి నియోజకవర్గ కేంద్రాలలో నియోజకవర్గ స్థాయి ప్రెస్ క్లబ్ ప్రతి మండల కేంద్రాలలో మండల స్థాయి ప్రెస్ క్లబ్ లు ఏర్పాటు చేసి చిన్న పేపర్లు,పెద్ద పేపర్లు, పిడిఎఫ్ పేపర్లు అనే తేడా లేకుండా ఐడి కార్డు ఉన్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు ఇప్పించి జర్నలిస్టుల పిల్లలు చదువుకునే ప్రైవేట్ పాఠశాలలో 50 % పిజ్ రాయితీ కల్పించాలని ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వమే ఇంటి స్థలాలు కేటాయించి వారు ఇల్లు కట్టుకొనుటకు ఆర్దికంగా వెనుక బడిన వారికి గృహ లక్ష్మీ పథకం వర్తింపచేయాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయిన జర్నలిస్టులకు రక్షణ కల్పించి వాళ్ల సమస్యలు తీర్చడంతో పాటు వాళ్లపై ఉన్న అక్రమ కేసులను తొలగించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాతంగి రవి , పెందుర్తి సతీష్ , చేపూరి నరసింహారావు, బండి నాగేశ్వరరావు , తాళ్లూరి ప్రసాద్ ,దాసరి సతీష్, అల్వాల రవి, గొబ్బి రాము, వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin