సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నుండి చిరుత పులి చర్మాన్ని తరలిస్తున్న 09 మంది స్మగ్లర్లను కొత్తగూడెంలో ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద పట్టుబడ్డారు. చిరుత పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్న కొత్తగూడెం అటవీశాఖ అధికారులు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, చతిస్గడ్ రాష్ట్రాలకు చెందిన తొమ్మిది మంది పులి చర్మాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వ్యక్తులు 1)గవర్ రాజు వేణు (తెలంగాణ),2) కందుకూరి ఫణేందర్ (ఆంధ్రప్రదేశ్) 3) పన్నీరు చిరంజీవి (ఆంధ్రప్రదేశ్) 4) సుద్దవల్లి శ్రీనివాస్ (ఆంధ్రప్రదేశ్),5) మాడావి కోసయ్య (ఆంధ్రప్రదేశ్) 6) కొలుముల ఏర్మయ్య (ఆంధ్రప్రదేశ్),7) మటకం మునేష్ (చతిస్గడ్) 8) మటకం జితేందర్ (చతిస్గడ్),9) పూనమ్ సింఘా (చతిస్గడ్). మగ చిరుత పులి ఆరు నెలల క్రితం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోనీ చింతల్ నార్ అటవీ ప్రాంతంలో చంపబడింది. ఉచ్చులో చిక్కుకున్న చిరుత పులిని బరిసెలతో పొడిచిన ఆనవాళ్లు గాయాలు ఉన్నాయి. చతిస్గడ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఈ చిరుతపులి చర్మాన్ని కొనుగోలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని చింతూరు ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఈ చర్మాన్ని తమ స్వాధీనంలో ఉంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రకాశం జిల్లాలోని వ్యక్తులు ఈ చర్మాన్ని అమ్మడానికి సిద్ధపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం కి చెందిన వ్యక్తులతో వారి సహాయంతో కొత్తగూడెంలో అమ్మడానికి ప్రయత్నించగా ఫారెస్ట్ ఆఫీసర్లు అరెస్టు చేశారు. ఆపరేషన్ లో పాల్గొన్న ఆఫీసర్లు ఏ. అప్పయ్య FDO కొత్తగూడెం,S సురేష్ FRO కొత్తగూడెం, టి వెంకటేశ్వర్లు DY RO కొత్తగూడెం, మస్తాన్ రాజు FSO కొత్తగూడెం, లక్ష్మణ్ FBO, పిచ్చయ్య FBO, మోహన్ FBO లక్పతి FBO తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin