సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మఠంపల్లి మండలలో క్లస్టర్ పెద వీడు, వర్ద పురం, మఠం పల్లి గ్రామాలలో ఘనంగా రైతు సంబరాలను జరుపుకున్నారు.ఈ వేడుకల్లో భాగంగా పెద వీడు, మఠంపల్లి, వరదాపురం క్లస్టర్ విభాగంలోని గ్రామాల రైతులు ట్రాక్టర్లతో ర్యాలీని నిర్వహించి, ,క్లస్టర్ రైతులు, రైతు వేదికల దగ్గరకు చేరుకున్నారు. మఠంపల్లి మండల వ్యవసాయ శాఖ వారు రైతు వేదికలలో నిర్వహించిన రైతు పండగ దినోత్సవం లో ఎంపీపీ మూడవత్ పార్వతి కొండ నాయక్ , జడ్పిటిసి జగన్ నాయక్ హాజరై మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ కరెంటును ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని వారు 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయని అభివృద్ధి సంక్షేమ పథకాలు కేసీఆర్ చేశారని, రైతులకు రైతుబంధు, రైతు బీమా, రైతులకు ఉచిత విద్యుత్ ను ఇస్తున్న ఘనత కేసిఆర్ కి చెందుతుందని వారు పేర్కొన్నారు. రైతులకు రైతు వేదికలను కట్టించిన ఘనత సీఎం కేసీఆర్ దే అని, రైతులు ఏవైనా సమస్యలు ఉంటే రైతు వేదికలో చర్చించుకోవచ్చని, మీకు అందుబాటులో వ్యవసాయ అధికారి అందుబాటులో ఉంటారని, రైతులు సీజన్ వారిగా ఏ ఏ పంటలు వేయాలో వ్యవసాయ అధికారిని అడిగి తెలుసుకోవచ్చునని, మేము కూడా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. రైతులు దళారీల చేతిలో మోసపోవద్దని ఉద్దేశంతో గ్రామ గ్రామాన ఐకెపి సెంటర్లను ఏర్పాటు చేసి, పండిన పంటకు గిట్టుబాటు ధరను కల్పించిన ఘనత కేసీఆర్ దేనిని అన్నారు. మన తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర పాలకుల నుండి విముక్తి పొంది 9 సంవత్సరములు నిండి 10 సంవత్సరాల ఉత్సవాల్ని జరుపుతున్న నేపథ్యంలో రెండో రోజు రైతు సంబరాలను నిర్వహించుకుంటున్నామని, తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని రాష్ట్రంలోని ప్రతి ఒక్క రైతుకు రైతుబంధు, రైతు బీమా లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందించి, పేద రైతులకు గా ఉంటుందని తెలియజేశారు. ప్రతి రైతు నూతనంగా ఆలోచించి సాగు విధానంలో మరింత మార్పులు తీసుకురావాలని సూచించారు. అనంతరం వారు పలు రైతులకు ప్రోత్సాహక అవార్డులను ఇచ్చి సత్కరించారు. ఇట్టి కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి ఎమ్మార్వో సాయా గౌడ్ , స్పెషల్ ఆఫీసర్ అన్నపూర్ణ , వరదాపురం సర్పంచ్ లు బచ్చలకూరి అఖిల, ఎస్ కె బిబి కుతుబ్, మన్నెం శ్రీనివాస్ రెడ్డి,పిఎసిఎస్ వైస్ చైర్మన్ బాబు నాయక్, , వర్థాపురం ఎంపీటీసీ జ్యోతి అశోక్ నాయక్, సర్పంచ్ టిక్య నాయక్ , పిఎసిఎస్ డైరెక్టర్,ఏఈఓ లు ఝాన్సీ రాణి, భవన్ మూన్యా ,నాయక్ , గ్రామ పంచాయితీ సెక్రటరీ లక్ష్మణ్ గ్రామ శాఖ అద్యక్షుడు చిలక సతీష్,ఎస్ సి సెల్ అధ్యక్షులు పల్లె మట్టయ్య, నిడికొండ సైదులు, పగిళ్ల సాయిలు,పలు గ్రామాల రైతులు, వ్యవసాయ అధికారులు, అంగన్వాడి సభ్యులు , ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin