సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ప్రెస్ క్లబ్ ఏర్పాటుతో ప్రతి ఒక్క జర్నలిస్టుకు గౌరవమని షాద్ నగర్ నియోజకవర్గ టీయూడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్టులు అన్నారు. ఈ సందర్బంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్ (పేపర్ శ్రీనన్న) ఆదేశాల మేరకు నియోజకవర్గ ప్రింట్ మీడియా అధ్యక్షుడు శ్రీశైలం ఆధ్వర్యంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్టులు హైదరాబాద్ లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ను కలిసి ధన్యవాదములు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రెస్ క్లబ్ ఏర్పాటుతో జర్నలిస్టులకు ఎంతో ఉపయోగకరమని, షాద్ నగర్ నియోజకవర్గంలోని మండల కేంద్రాలతో పాటు షాద్ నగర్ పట్టణంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దిన దిన అభివృద్ధి చెందుతున్న షాద్ నగర్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్ క్లబ్ నిర్మాణానికి చేయూతనివ్వడం ఎంతో సంతోషకరమని ఇందుకు కృషిచేసిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సేవలు మరువలేము అని అన్నారు. జర్నలిస్టులు ఇండ్ల స్థలాల గురించి విన్నవించగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సుముఖత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా వైస్ ప్రెసిడెంట్ రాఘవేందర్ యాదవ్ (రఘు), సుధాకర్, భాస్కర్, రమేష్, ఇలియాస్, సమీ, రాజశేఖర్, ఖాజా సోహైల్, శ్రీకాంత్, భైరమోని, శ్రీహరి రాజు, ఇక్బాల్, శివ, సురేందర్, యాదయ్య, జగన్, మల్లేష్, కార్తిక్, తదితరులు ఉన్నారు.
-----------------------
Admin