సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మేళ్లచెరువు మండలం రామపురం గ్రామంలో సి ఐ టీ యూ ఆధ్వర్యంలో ప్రియా సిమెంట్. ఫ్యాక్టరీ క్లస్టర్ పరిశ్రమ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. అనంతరం కార్మికుల వేతనాల సమస్యలపై మేనేజ్మెంట్ అంజయ్య కి పలు అంశాలతో కూడిన డిమాండ్ నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా సిమెంట్ క్లస్టర్ పరిశ్రమల వర్కర్స్ యూనియన్ కన్వీనర్ వట్టెపు సైదులు. మాట్లాడుతూ తమ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించకుంటే సమ్మెకు దిగి పోరాడుతామని తెలిపారు. యజమాన్యం వర్కర్లను చిన్నచూపు చూస్తు ఒంటెదు పోకడ పోతుందని అట్లాంటి ఒంటేదు పోకడలు మానుకొని కార్మికులకు తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు, కార్యదర్శులు.ఎస్ ప్రకాష్. టి.శీను. అజముద్దీన్. ఎల్ ఎస్ రావు.రామారావు. ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin