Thursday, 30 July 2026 08:47:13 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నైజాం నవాబ్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ప్రాంతాలను సందర్శించిన బిజెపి నాయకులు...

Date : 17 September 2022 12:13 AM Views : 578

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : వేంసూర్ గ్రామంలో, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని, నైజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ప్రాంతాలను, కట్టడాలను ,స్ఫూర్తి కేంద్రాలను సందర్శించాలనే కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గం లోని వేంసూర్ గ్రామంలో 1927 లో నిర్మించిన పోలీస్ స్టేషన్ ను బిజెపి నాయకులు శుక్రవారం సందర్శిం చారు. ఆనాటి నిజాం కు వ్యతిరేకంగా గ్రామ రక్షక దళం అనే పేరుతో చాలామంది నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేయటం జరిగిందని బిజెపి నాయకులు అన్నారు. నిజాం సైనికులు సాగించిన ఆకృత్యాలకు , ఆగడాలకు మానభంగాలకు, హత్యలకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేయడం జరిగిం దని వారు తెలిపారు.సాయుధ పోరాట యోధులను వేంసూర్ గ్రామంలో నిర్మించినటువంటి పోలీస్ స్టేషన్లో బంధించి అనేక చిత్రహింసలకు గురి చేయటం జరిగింద ని అన్నారు. చాలామంది ఈ పోలీస్ స్టేషన్లోనే అసువులు బాసటం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం వేంసూరు గ్రామంలో ఉన్న పోలీస్ స్టేషన్ మరియు ఆ స్థలాన్ని సాయుధ తిరుగుబాటుయోధులకు, గుర్తుగా , చిహ్నంగా, వారికి ఘన నివాళులర్పించేందుకు ఒక స్ఫూర్తి కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాగానే ఈ ప్రాంతాన్ని ఒక మంచి స్ఫూర్తి కేంద్రంగా తయారు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరు .రామలింగేశ్వర రావు, సీనియర్ నాయకులు దొడ్డపనేని .కృష్ణయ్య , వేంసూరు మండల ఉపాధ్యక్షులు మట్టా .ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :