Friday, 31 July 2026 10:55:39 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వేల్పూర్ రైతు వేదిక వద్ద జరిగిన నిరసన సభలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి...

Date : 18 July 2023 06:38 AM Views : 373

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ నియోజక వర్గం వేల్పూరు తెలంగాణ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బాల్కొండ నియోజకవర్గం వేల్పూరు రైతు వేదిక వద్ద జరిగిన నిరసన సభలో రైతులతో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎకరం పారడానికి ఒక గంట చాలు.. 24 గంటల ఉచిత విద్యుత్ వద్దు అని రేవంత్ రెడ్డి మాట్లాడడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఖండించారు. ఈ సందర్బంగా రైతులు గతంలో కరెంట్ కష్టాలతో పడ్డ తమ అనుభవాలను పంచుకున్నారు. వేల్పూర్ రైతు చిన్నారెడ్డి మాట్లాడుతూ...అమెరికాలో ప్రశ్న అడిగిన వారే..గంటకు ఎకరం ఎట్లా పారుతదని రేవంత్ రెడ్డిని ఒక్కటి పీకాల్సింది. మన మేమైన జర్మనీ,ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడుతున్నమా అని. రైతు సత్య గంగయ్య మాట్లాడుతూ.. 25 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న. 4 గంటల్లో కూడా ఎకరం పారదు. గతంలో కాంగ్రెస్ పొద్దున,మధ్యాహ్నాం,రాత్రి రెండు గంటల చొప్పున కరెంట్ ఇచ్చేది,పంటలు ఎండి పోయేవి. ఇప్పుడు కేసిఆర్ 24 గంటలు కరెంట్ ఇస్తున్నడు,పంటలు మంచిగ పండుతున్నాయి. 24 గంటల ఉచిత కరెంట్ వద్దు అంటున్న రేవంత్ రెడ్డి "పాము కాటు వేయించుకొని" వద్దు అని మాట్లాడాలి. రానున్న రోజుల్లో రైతు వ్యతిరేకి అయిన కాంగ్రెస్ పార్టీ చెంప చెల్లుమనిపిస్తాం. రైతు నీరటి రాజేశం మాట్లాడుతూ.. ఎకరం ఒక గంటలో పారిస్తామని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఆయనే ఒక వ్యక్తిని పంపితే జీతానికి పెట్టుకుంటాం. గంటలో ఎకరం పారించి చూపించాలి. రామన్నపేట రైతు శంకర్ గౌడ్ మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి వచ్చి గంటలో ఎకరం పొలం పారించి చూపాలి. కాంగ్రెస్ హయాంలో బోర్ లో పెండ నీళ్లు పోసి స్విచ్ ఆన్ చేయడానికి పోయే సరికే కరెంట్ పోయేది. కరెంట్ తో గోస పడ్డాం. రోజంతా అర ఎకరం కూడా పారేది కాదు. పడగల్ రైతు గోలి వసంత్ మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కరెంట్ గోస ఉండేది.కడుపు నిండా తిండి లేక,కంటి నిండ నిద్ర లేక అవస్థలు పడ్డాం. కేసిఆర్ వచ్చిన తర్వాత 24 గంటల ఉచిత విద్యుత్ తో 3పంటలు పండిస్తున్న. రైతులం సంతోషంగా కడుపునిండా పెరుగన్నం తింటున్నాం. 24 గంటల ఉచిత కరెంట్ వద్దని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పేవరకు రైతుల నిరసనలు ఆపం. అని పలువురు రైతులు తమ అనుభవాలు చెప్పుకున్నారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి ఉచిత కరెంట్ పై చేసిన వ్యాఖ్యల వీడియో మంత్రి రైతులకు చూపించారు. అనంతరం నిరసన సభలో మంత్రి రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.. "పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తాము అధికారం లోకి వస్తే ఎం చేయబోతున్నరో చెప్పాడు.రేవంత్ బలుపుతో 24 గంటల కరెంట్ అవసరం లేదు అని ఎలా అంటాడు. ఉచిత కరెంట్ ఇస్తే రేవంత్ కు ఎం నష్టం కాంగ్రెస్ కు ఎం నష్టం. ఇంకా కాంగ్రెస్ పార్టీ దురహంకార వైఖరి పోలేదు. 24 గంటల కరెంట్ తో సంతోషం గా ఉంటె నీకు , నీ పార్టీకి ఎందుకు కడుపు మంట.నీ అబ్బా సొత్త కరెంట్ , బిచ్చమేస్తున్నావ. రేవంత్ రెడ్డి కి కడుపు లో ఎంత విషముందో రైతులు గమనించాలి. కిరణ్ కుమార్ రెడ్డి శాపం పెట్టిండు ...చిమ్మ చీకట్లో ఉంటారు అని విషం కక్కిండు. అప్పుడు జానారెడ్డి కూడా అసెంబ్లీ లో వ్యతిరేకించారు. ఇది యాక్సిడెంటల్ గా మాట్లాడింది కాదు. మనసు లో ఉన్నదే వచ్చింది బయటకు. ఛత్తీస్గఢ్ లో 8 గంటల కరెంట్ మాత్రమే ఇస్తది ...వాళ్లు మిగుల్చుకోని అమ్ముకుంటారు. అది మనమే కొంటున్నాం ... అక్కడ కొని ఇక్కడ రైతులకు ఇస్తున్నాం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కి జాతీయ విధానం ఉండదా..? నేను రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నిస్తున్న. అధికారంలో ఉన్న అన్ని రాష్ట్ర ల్లో 24 గంటల కరెంట్ ఇస్తారా .? కేసీఆర్ నీలాగా గోడలకు పెయింట్స్ వేయలేదు. ఆర్టీఏ అప్లికేషన్లు పెట్టి బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇలాంటి వాళ్లు ముఖ్యమంత్రి అయితే ఇక అధమ పాతాళానికే. సీఎం ఛత్తీస్ ఘడ్ నుండి కొనే కరెంట్ విషయం లో ప్రవైట్ ఇవ్వమని పట్టుదల గా ఉండే. ఎన్నో ప్రవైట్ కంపెనీలు వచ్చిన కూడా నేరుగా ప్రభుత్వం నుండే కొన్నారు. ఛత్తీస్ ఘడ్ నుండి కరెంట్ తెచ్చుకునేందుకు లైన్లు కూడా లేవు. 60 సంవత్సరాల కాంగ్రెస్ లో కనీసం లైన్లు కూడా వేసుకోలేదు. 4500 మెగావాట్ల ఉన్న తెలంగాణ 18 వేలా మెగావాట్ల ఉత్పాదన ఏర్పాటు చేసుకున్నాం. 80వేలా కోట్లతో పూర్తయిన కాళేశ్వరానికి లక్ష కోట్ల అవినీతి జరిగింది అంటున్నారు. ఎంత సిగ్గు చేటు బీజేపీ నేతలది. బీజేపీ రైతుల మోటార్లకు మీటర్లు పెడతామని,కాంగ్రెస్ ఉచిత విద్యుత్ అవసరం లేదని మాట్లాడుతున్నారు. రైతులు ఆలోచన చేయాలి.మోస పోతే గోస పడతాం." అని అన్నారు. ఎంపి అరవింద్ పై మంత్రి వేముల ఫైర్ "అరవింద్ పసుపు బోర్డు తేకపోతే రాజీనామా చేస్తానని చెప్పి మోసం చేసి ఎంపి ఐనోడు. రైతులను మోసం చేసి దర్జాగా తిరుగుతూ.. కష్టపడుతున్న మా లాంటి వాళ్లను ఇష్టం వచ్చినట్లు అచ్చోసిన ఆంబోతు వలె ఒర్లుతున్నడు. నాలుగున్నరేళ్ల లో తప్పు చేయని ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు చేస్తాడా. ఇప్ప్పుడే ఎన్నికల ముందు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు.ప్రజలుఆలోచించాలి.ఎంపీ కి కనీస అవగాహన లేదు. డబుల్ బిల్ తీసుకునే అవకాశమే లేదు అది సాధ్యం కాదు కానీ ఆరోపణ చేసిండు. నిధులు అస్సలే మల్లించలేదు. సెంట్రల్ ఫైనాన్స్ అసిస్టెన్స్ కింద కేంద్రం 300 కోట్లు కేటాయించారు. దానిలో 70 కోట్లు బాల్కొండ లోని రోడ్లకు, బ్రిడ్జి కి కేటాయించుకున్నం. దాన్ని తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తున్నారు. సిబిఐ ఎంక్వేరి కాదు అంతకు మించి ఇంకేమైనా ఇంక్వైరి చేసుకోవచ్చు. అయినా మీరు పని చెసే వాళ్ళ మీదనే మీరు ఈడీ లు , సిబిఐ లు ప్రయోగిస్తారు. అదే మీ పని." అంటూ అరవింద్ పై మంత్రి మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రైతు నాయకుడు కోటపాటి నర్సింహ నాయుడు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు,రైతు బంధు సమితి సభ్యులు,రైతులు,బిఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: