సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : అంధత్వ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ శ్రీకారం చుట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. షాద్ నగర్ మున్సిపాలిటీలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా కంటి వెలుగు వైద్య సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని కంటి సమస్యలతో బాధ పడుతున్న ఎంతోమంది సద్వినియోగం చేసుకోవడం జరిగిందని, కంటి వెలుగు కార్యక్రమంలో కంటి పరీక్షలు చేసిన వెంటనే అద్దాలు ఇవ్వడంతో పాటు ఆపరేషన్ అవసరమైన వారిని రెఫర్ చేయడం జరిగిందన్నారు. ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేసిన ఏకాక ప్రభుత్వం తెలంగాణ సర్కారని అన్నారు. ప్రజల క్షేమమే లక్ష్యంగా సర్కార్ ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజ్, కమిషనర్ వెంకన్న, కౌన్సిలర్లు బచ్చలి నరసింహ, ఈగ వెంకట్రాంరెడ్డి, బిఆర్ఎస్ నాయకులు యుగంధర్, మహ్మద్ ఎజాజ్ (అడ్డు), ప్రదీప్ కుమార్, మలగారి సత్యనారాయణ, అంతటి కోటిలింగం, పోకల శేఖర్ అప్ప, కత్తి చంద్రశేఖర్, వార్డు సభ్యులు, కంటి వెలుగు కార్యక్రమం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin