సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : త్రిపుర రాష్ట్ర గవర్నర్ గా నల్లు ఇంద్రసేనారెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా తుంగతుర్తి కి విచ్చేసిన సందర్భంగా నియోజకవర్గ కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా అధ్యక్షతన నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నల్లు ఇంద్రసేనారెడ్డి బిజెపి లో 40 సంవత్సరాలకు పైగా అంకితభావంతో పనిచేసి ఎన్నో ప్రజా పోరాట ఉద్యమాలలో పాల్గొని భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేశారు.విద్యార్థి దశ నుండే సమస్యలపై పోరాడిన వ్యక్తి ఇంద్రసేనారెడ్డి ఒక సామాన్య కార్యకర్తను భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తించి త్రిపుర రాష్ట్ర గవర్నర్ గా నియమించినందుకు భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా పక్షాన, వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం..నల్లు ఇంద్రసేనారెడ్డి పుట్టి పెరిగిన ప్రాంతం తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ద్వారా సహకారం అందించేలా కృషి చేయాలని కోరారు.అనంతరం బిజెపి జిల్లా, మండలాల నాయకులు త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి కి పూల బొకేలు ఇచ్చి శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, రాష్ట్ర నాయకులు సంకినేని రవీందర్రావు, సంకినేని వరుణ్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడియం రామచంద్రయ్య, అసెంబ్లీ కన్వీనర్లు కాప రవికుమార్, కర్నాటి కిషన్, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర, జిల్లా అధికార ప్రతినిధి పల్స మల్సూర్ గౌడ్ , మండల అధ్యక్షులు గాజుల మహేందర్, జిల్లా నాయకులు బొలిశెట్టి కృష్ణయ్య, అంబల్ల నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin