సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : జనవరి 4వ తేదీన సికింద్రాబాద్ బోయినిపల్లి లో గాంధీ ఐడియాలజి కేంద్రంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మరియు ఖమ్మం నగర కాంగ్రెస్ అద్యక్షులు ఖమ్మం నియోజకర్గ పి సి సి సభ్యులు మహ్మద్ జావేద్ పాల్గొన్నారు. సదస్సులో టీపీసీసీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి ఎంపీ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తో పాటు సీనియర్ నాయకులు, శిక్షణకు సంబందించిన నిష్ణాతులు హోజరు అయ్యారు.ఈ సందర్భంగా ధరణి లోపాలు, హాత్ సే హాత్ జోడో కార్యక్రమం, ఎన్నికల నిబంధనలు, నియమావళి, మీడియా రిలేషన్స్, మెంబర్షిప్ ఇన్సూరెన్స్ తదితర అంశాలపై కార్యక్రమము జరిగినట్టు పువ్వాళ్ళా దుర్గా ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు పి సి సి ఉపాద్యక్షులు పోట్ల నాగేశ్వరరావు ,వైరా నియోజకవర్గ పి సి సి సభ్యులు మాళోత్ రాందాస్ నాయక్,కొత్తగూడెం నియోజకర్గ సభ్యులు జె బి శౌరి తదితర నాయకులు పాల్గొన్నారు.
-----------------------
Admin