సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం శ్రీ అంకమ్మ గోపయ్య తిరుపతమ్మ తల్లి దేవాలయం నందు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బానోతు భీముడు ఆధ్వర్యంలో అశ్వరావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రచార రధమును ప్రారంభించారు. అనంతరం ప్రధాన సెంటర్ వరకు ప్రచార రథంతో ర్యాలి నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి యువత రుణం తీర్చిదిద్దే దిశగా రానున్న ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ పాలనకు ముగింపు పలకాలని యువతకు పిలుపునిచ్చారు. తెలంగాణ యువత, యువశక్తిని మేలుకొలిపే దిశగా రాజీవ్ గాంధీ యూత్ డిక్లరేషన్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ కలదు కనుక ఆన్లైన్ పరీక్ష జూన్ 18 న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 60 ప్రశ్నలు 60 నిమిషాలు ఉంటుందని అర్హత గల వయసు నుంచి 35 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ తేదీ జూన్ 17 వరకు కలదు సంచలనాత్మక తెలంగాణ యూత్ డిక్లరేషన్ స్ఫూర్తిగా తెలంగాణ యువతను మేలుకొలిపే దిశగా రిజిస్ట్రేషన్ కొరకు మిస్డ్ కాల్ ఇవ్వవలసిన నెంబర్ 7661899899 SMS పొందుతారు. వచ్చిన లింక్ తో రిజిస్ట్రేషన్ చేసుకొవలని పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో చల్లా పుల్లయ్య, చల్లా రమేష్,ఇనుపనూరి రాంబాబు,పెద్దవరపు నాగరాజు ,చేకూరి రవి, సుబాని పలువురు ప్రముఖులు హాజరయ్యారు..
-----------------------
Admin