సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : నేను కరడుగట్టిన కాంగ్రెస్ వాదిని [దినేష్ సాగర్], ఎంతోకాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేశాను.. సొంత ఖర్చులు పెట్టుకుని ఇన్నేళ్లుగా పార్టీ కార్యక్రమాలు చేశాను.. కాంగ్రెస్ పోరాటాల్లో కేసులు పెడితే కూడా భరించాము కానీ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ ఓ హిట్లర్ గా అవతరించాడని అహంకారపూరితంగా తమ పట్ల వ్యవహరించాడని పార్టీ ద్రోహులుగా చిత్రీకరించి మానసిక క్షోభకు గురి చేశాడని అందుకే కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్ విభాగాలకు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఎన్ఎస్ యూఐ జాతీయ కన్వీనర్ దినేష్ సాగర్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కాటం సుధీర్ ప్రకటించారు. శుక్రవారం షాద్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దినేష్ సాగర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వద్ద ఎన్నికల్లో డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నామని అభాండాలు వేశారని దీంతో తాము మానసికంగా కుంగిపోయినట్టు సాగర్ కంటతడి పెట్టారు. పార్టీని వదిలిపెట్టడానికి మనసు రావడంలేదని కానీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ అహంకారపూరిత ధోరణితో పార్టీని వీడనున్నట్టు దినేష్ సాగర్ బోరున విలపించారు. కాంగ్రెస్ పార్టీకి తాను కొత్త కాదని పార్టీలు మారిన వీర్లపల్లి శంకర పార్టీకి కొత్త అని విమర్శించారు. ఆత్మగౌరవం చంపుకొని పనిచేయలేమని ఆవేదన వ్యక్తం చేశారు. తాను టిఆర్ఎస్ వద్ద డబ్బులు తీసుకున్నట్టు చేస్తున్న ఆరోపణలపై ఏ గుడికైనా వచ్చి ప్రమాణం చేస్తానని కాంగ్రెస్ నాయకులు కూడా ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఆత్మాభిమానం చంపుకొని పనిచేద్దామన్న మనసు ఒప్పడం లేదని అన్నారు. డబ్బులు తీసుకున్నామని టిఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేస్తున్నామని ద్రోహులుగా ముద్ర వేసి అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని దినేష్ సాగర్ శపదం పలికారు. ఈరోజు వరకు కాంగ్రెస్ పార్టీ నుండి పిలుపు వస్తుందని పార్టీకి పనిచేయాలని ఎంతో ఎదురుచూశామని కానీ కాంగ్రెస్ విభాగ నేతలను అందరిని విస్మరించారని అందుకే ఈ విభాగాలలో అందరం కలిసి మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలారా బీఆర్ఎస్ పార్టీలోకి రండి అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజలు కార్యకర్తలు తగిన శాస్తి అనుభవిస్తారని ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోవాలని దినేష్ సాగర్ అన్నారు. రాజీనామా చేశాకనియోజక వర్గంలో పదివేల ఓట్లను ప్రభావితం చేస్తానని చాలెంజ్ విసిరారు. తన సత్తా ఏమిటో కాంగ్రెస్ పార్టీకి చూపిస్తానని అన్నారు. మంత్రి కేటీఆర్ తనకు అభయం ఇచ్చారని త్వరలోనే పార్టీలో చేరుతామని పార్టీని బలోపేతంగా మారుస్తామని అన్నారు. యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కాటం సుధీర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ గాలి వీస్తోందని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను పట్టించుకోకపోతే గాలి ఎలా వీస్తుందని ప్రశ్నించారు. ఇన్నాళ్లు పార్టీకి కష్టపడి డబ్బులు పెట్టుకొని పని చేశామని ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తుంటే బాధగా ఉందని బోరున విలపించారు. ఈ సందర్భంగా దినేష్ సాగర్, సుధీర్ ఇరువురు మీడియా ముందు కంటతడి పెట్టారు....
-----------------------
Admin