సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి : ఆరు గ్యారంటీల్లో భాగంగా మరో రెండు గ్యారెంటీ లైన 500 రూపాయలకే గ్యాస్ బండ,200 యూనిట్ల ఉచిత కరెంట్ ను అమలు చేస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు వనమా గాంధీ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంచారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో తొలుత రెండు సంక్షేమ పథకాలను సీఎం రేవంత్ అమలు చేశారని,మరో రెండు పథకాలను నిన్నటి నుండి అమలు చేస్తున్నారని మొత్తం మీద సీఎం రేవంత్ పేదల పక్షపాతి అని వారు పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని,ఎన్నికల హామీల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఆయన అమలు చేస్తున్నారని వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పరసా వెంకటి,వేముల రమణ,దుబ్బాకుల రాము, రావుల ఉదయ్ కిరణ్,మరకాల లక్ష్మారెడ్డి,మాయర కృష్ణయ్య,మడివి నాగేంద్రబాబు,ఇనపనూరి జమలయ్య,లకావత్ రాజు,వీరబోయిన వెంకటేశ్వరరావు,బోడా పద్మ, గోళ్ళ రేణుక తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin