సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం నియోజకవర్గ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూదాల అజితారావు ఎన్నికల ప్రచార రథంతో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూదాల అజితారావు నేను మీ ఇంటి బిడ్డను మీ ఇంటి ఆడపడుచును ఆదరించండి నేను మీకు అండగా ఉంటా అంటూ ఎన్నికల ప్రచారం చాలా రసూత్తంగా సాగుతుంది. ఈరోజు త్రిపురాంతకం మండలం పాతన సముద్రం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న శ్రీ బూదాల అజితరావు సమక్షంలో జనసేన పార్టీలో నుండి ఐదు కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రాష్ట్రానికి ఎంతో మేలు జరిగిందని పేద కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ వల్ల ఎంతో మేలు జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ బూదాల అజితారావు గ్రామ ప్రజల ను ఉద్దేశించి మాట్లాడుతూ నేను మీ ఇంటి ఆడబిడ్డను రెండుసార్లు తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నాను ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇక్కడ పేద ప్రజల అభివృద్ధి కోసం శ్రమించి కష్టపడతానని మీ అభివృద్ధి నా ధ్యేయంగా పోరాడుతానని నన్ను భారీ మెజార్టీతో గెలుస్తానని నాకు నమ్మకం ఉంది. నా బలము నా బలగము నా ధైర్యము మీరే నన్ను ఆదరించండి అంటూ ప్రచారంలో దూసుకుపోతున్న బోదాల అజితరావు దయచేసి ఒక్కసారి ఆలోచించండి అనంతరం కొత్త అన్న సముద్రంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీగా పాల్గొన్నారు...
-----------------------
Admin