సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల పరిధి లోని గాజుకుంట పల్లి గ్రామం జిల్లా డి ఎం హెచ్ ఓ కృష్ణారెడ్డి ఫ్రైడే డ్రై డే కార్యక్రమమును పరిశీలించు నిమిత్తం ఆకస్మికముగా తనికీ చేయడం జరిగినది. ఇందులో భాగం గా గ్రామం లోని వీదులయందు కలియతిరుగుతూ పరిసరాల పరిశుభ్రత, నీటి నిలువ, నీటి తొట్టెల లార్వా నిలువ, పైపుల లీకేజీ , క్లోరినేషన్ తదితర అంశాలను నిశితం గా పరిశీలించి సీజనల్ వ్యాదులైన మలేరియా, మెదడు వాపు, చికెన్ గున్యా, డెంగ్యూ, బోదకాలు మొదలగు వాటి పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు, నివారణా చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.స్థానిక సర్పంచు అధ్యక్షతన జరిగిన చర్చా గోష్ఠి నందు పాల్గొని పలు ఆరోగ్య సమస్యల పట్ల సూచనలు యివ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో గాజుగుంటపల్లి సర్పంచ్ బాబా ఫక్రుద్దీన్ ,ఉప మలేరియా జిల్లా అధికారి లక్ష్మే నాయక్, డాక్టర్ భాను ప్రకాష్, మండల విభాగ మలేరియా అధికారి దేవ్లా నాయక్, మలేరియా ఆరోగ్య పర్యవేక్షకులు శశిధర్, గోపి నాయక్, కమ్యూనిటీ ఆఫీసర్ శుభాషిణి, ఇతర ఆరోగ్య, ఆశ సిబ్బంది పాల్గొన్నారు
-----------------------
Admin