సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకర్గం, కొందుర్గు మండలం రేగడి చిలకమర్రి ఉమ్మంత్యాల గంగన్నగూడెం నమో అమృతపానం కార్యక్రమ అంబలి కేంద్రాలను, బిజెపి సీనియర్ నేత పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... మద్యం వల్ల రెండు నెలలు అంబలి తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు గ్రామాలలో ఎంతోమంది జీవితాలు ఆగమవుతున్నాయని, చెడు అలవాట్లను వదిలేసి ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్యాంసుందర్ రెడ్డి, బోయ అశోక్, గణేష్ రెడ్డి, వెంకట్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, చంద్రశేఖర్, కృష్ణయ్య, సుభాష్ రెడ్డి, బిజెపి కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin