సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా అనవసరమని, రోజుకు మూడు గంటలు సరఫరా చేసై చాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆర్మూర్ నియోజకవర్గ రైతులు భగ్గున మండిపడుతున్నారు. పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి నాయకత్వం లో వందలాది మంది రైతులు ఆర్మూర్ పట్టణంలో గురువారం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మకు శవ యాత్ర నిర్వహించి 14వ వార్డు (జిరాయత్ నగర్ )లో గల విద్యుత్ సబ్-స్టేషన్ వద్ద దగ్ధం చేశారు. ఈ శవ యాత్ర అగ్రభాగాన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిలిచారు. అనంతరం పిండం పెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. మూడు గంటలకాంగ్రెస్, మోటార్లకు మీటర్లు పెట్టే మత విద్వేష బీజేపీ నాయకులు మా పల్లెలకొస్తే పాతేస్తాం"అని రైతులు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఈ సందర్భంగా రైతులు 3గంటల కరెంట్ వద్దు..24గంటలే ముద్దు అంటూ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డికీ చంద్రబాబు గతే కాగా రైతుల నిరసన కార్యాక్రమానికి నాయకత్వం వహించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతులతో, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పెట్టుకున్నోళ్లెవరూ తట్టుకోలేరని, మట్టికొట్టుకు పోతారని హెచ్చరించారు. రైతులకు 3గంటల కరెంట్ చాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విషం కక్కిండు. నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలంగాణ రైతులను అరిగోస పెట్టింది. విద్యుత్ చార్జీలను తగ్గించమంటే బషీర్ బాగ్ లో రైతులను చంద్రబాబు కాల్చి చంపించిండు. ఇప్పుడు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించిండు. తెలంగాణ రైతుల బతుకులు బాగుపడటం ఆయనకు ఇష్టం లేదు.బాబు హయాంలో మాదిరిగానే ఇప్పుడు కూడా రైతులు దుఃఖంలో ఉండాలని కోరుకుంటున్నాడు. అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామంటున్నారు. రెవెన్యూ అధికారులే రైతుల ఇండ్ల వద్దకు వచ్చి నయాపైసా ఖర్చు లేకుండా పనులు చేసే ధరణి కావాలంటే రైతులు బీఆర్ఎస్ వెంట ఉంటారు. ఎప్పటిలాగే రెవెన్యూ ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతూ లంచాలు ఇచ్చే పాత పద్ధతి కావాలంటే కాంగ్రెస్ వైపు ఉంటారు. 24గంటల కరెంట్ కావాలంటే కేసీఆర్ వైపు, 3గంటలు కావాలనుకుంటే కాంగ్రెస్ వైపు, మత విద్వేషాలు రెచ్చగొట్టడం మోటార్లకు మీటర్లు పెట్టడం మంచిదనుకుంటే బీజేపీ వైపు ఉంటారు. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే. రెండూ తెలంగాణ వ్యతిరేక పార్టీలే. కాంగ్రెస్ చీకట్లమారి పార్టీ. బీజేపీ తాకట్లమారి పార్టీ"అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ ఇంతియాజ్ అలీ, మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినిత పవన్,వైస్ చైర్మన్ మున్నా భాయ్, కౌన్సిలర్లు, గంగా మోహన్ చక్ర, ఆకుల రాము, బండారి శాల ప్రసాద్, ఫయాజ్ అలీ, అబ్దుల్ రెహ్మాన్, పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్ లతో పాటు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-----------------------
Admin