సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ఫిబ్రవరి 16వ తేదీన కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న నిర్మాణ రంగ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు జిల్లా కార్యదర్శి ఉప్పుతల నరసింహారావు మంగళవారం పిలుపునిచ్చారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నరసింహారావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 1996 నిర్మాణ రంగ కార్మికుల చట్టాన్ని రద్దుచేసి నిర్మాణరంగ కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని విమర్శించారు. కార్మిక చట్టాల రద్దు వల్ల కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు లాభాలు సమకూర్చటం కోసం కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక సంక్షేమంపై కార్మిక హక్కులపై దాడి చేస్తుందని విమర్శించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ జరుగుతుందని తెలిపారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మికులు కర్షకుల హక్కుల పైన చేస్తున్న దాడి దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేస్తుందని పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న నిర్మాణ రంగానికి తగిన సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. నిర్మాణరంగ కార్మికుల్లో సంక్షేమ పథకాల అమలుకు ఏర్పాటు చేయబడిన సంక్షేమ బోర్డులను కేంద్ర బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని సిఐటియు పేర్కొన్నది. 1996 కేంద్ర చట్టాన్ని రక్షించుకోవాల్సిన అవసరం నిర్మాణంగా కార్మికులపై ఉందని గుర్తు చేశారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరల చట్టం చేయాలని ఉపాధి హామీ కూలీలకు 200 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ బోర్డు ద్వారా మోటార్ సైకిల్ పంపిణీ చేపడతామని వాగ్దానం చేసి అమలు చేయలేదని నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మోటారు సైకిళ్ళు పంపిణీ పథకాన్ని ప్రారంభించాలని సిఐటియు డిమాండ్ చేసింది. వెల్ఫేర్ బోర్డులో ఉన్న డబ్బును కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 16వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సంస్థలు పాల్గొనాలాన్నారు. నిర్మాణరంగ కార్మికులు పని కేంద్రాలతో పాటు నివాస ప్రాంతాల్లో సైతం కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇంటింటి ప్రచారం నిర్వహించాలని పిలుపునచ్చారు. సమావేశంలో తెలంగాణ బిల్డింగ్, అధర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు నాయకులు గుర్రం.రాములు అశోక్, కృష్ణయ్య, ఉపేందర్, మురళి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin