సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంతకల్ల జగదీశ్వర్ రెడ్డి ఆదేశానుసారం నల్లగొండ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గెలుపును కాంక్షిస్తూ హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని గరిడేపల్లి మండలం అప్పన్నపేట,రేకులగడ్డ తండా గ్రామాలలో మండల పార్టీ,గ్రామ శాఖ ఆధ్వర్యంలో అప్పన్నపేట రేకులగడ్డ తండా గ్రామాలలో ఇంటింటికి వెళ్లి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి కారు గుర్తుకి ఓటు వేయాలని సూచించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి ఒంటెద్దు నరసింహారెడ్డి గరిడేపల్లి మండల పార్టీ అధ్యక్షులు గుగులోతు కృష్ణ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కానీ హామీలను ఇచ్చి గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిందని ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో వారిని ప్రజలు నమ్మేలా లేరని ప్రజలందరూ బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రస్తుతం గుర్తించారని ఈ సందర్భంగా వారికి తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో హడక్ కమిటిసభ్యులు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin