సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దొంతి కాంతమ్మ భౌతిక కాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు, జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్ సర్కార్ న్యూస్ నర్సంపేట నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి కీర్తిశేషులు దొంతి కాంతమ్మ అనారోగ్యంతో హనుమకొండలోని ఎమ్మెల్యే స్వగృహంలో పరమపదించగా కాంతమ్మ భౌతిక కాయానికి బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు కడారి సురేష్ యాదవ్, జిల్లా కార్యదర్శి కానుగుల కుమారస్వామి, జిల్లా సహాయ కార్యదర్శి మట్ట రమేష్ యాదవ్, దుగ్గొండి మండల ఉపాధ్యక్షుడు చొప్పరి భాస్కర్ ముదిరాజ్ లు పాల్గొన్నారు.
-----------------------
Reporter